ప్రపంచ ధ్యాన దినోత్సవంలో భాగంగా న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ వద్ద ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్ నేతృత్వంలో ఆదివారం జరిగిన ప్రత్యక్ష ధ్యాన కార్యక్రమం ప్రపంచ రికార్డులను తిరగరాసింది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ , ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ , వరల్డ్ రికార్డ్ యూనియన్‌లో స్థానం దక్కించుకుంది.
యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారమైన ఈ గైడెడ్ ధ్యాన కార్యక్రమానికి అత్యధిక వ్యూస్ లభించినట్టు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకటించింది. భారతలోని అన్ని రాష్ర్టాల నుంచి అత్యధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్న ఈ కార్యక్రమం ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్సును సాధించింది.