గురువారం 03 డిసెంబర్ 2020
National - Oct 23, 2020 , 13:35:56

హెచ్‌సీఎల్ ఉద్యోగులకు ఆఫీస్ నుంచే వర్క్...? వారికి మాత్రం మినహాయింపు..!

హెచ్‌సీఎల్ ఉద్యోగులకు ఆఫీస్ నుంచే వర్క్...? వారికి మాత్రం మినహాయింపు..!

ముంబై : కరోనా నేపథ్యంలో పలు సంస్థలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చిన సంగతి తెలిసిందే... వీటిల్లో ఐటీ కంపెనీలే ఆయా వెసులుబాటు కల్పించాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పూర్తిగా తగ్గక పోవడంతో దిగ్గజ కంపెనీలు అన్నీ ఇంటి నుంచి పని చేసే సౌకర్యాన్ని వచ్చే ఏడాది వరకు పొడిగించగా, కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టనప్పటికీ కేసులు తగ్గడంతో పలు కంపెనీలు ఉద్యోగులను కార్యాలయాలకు రమ్మని పిలుస్తున్నాయి. తాజాగా హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వారానికి ఓ రోజు కార్యాలయానికి రప్పించాలనే ఆలోచనలో ఉన్నది. కరోనా తీవ్రత కొంత తగ్గడంతో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కొన్నికంపెనీలు 30 శాతం ఉద్యోగులను కార్యాలయాలకు రప్పిస్తున్నాయి.

భౌతిక దూరం పాటించడం, శానిటైజర్ల ఏర్పాటు వంటివి అందుబాటులో ఉంచుతున్నారు. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించేందుకు సిద్ధమైంది. వారంలో ఒకరోజు అయినా ఆఫీస్‌లకు రావాలని ఉద్యోగులకు సూచించింది. అయితే ఇది అప్పుడే అమలులోకి రాదు. డిసెంబర్ నుంచి పాటిస్తారు. ప్రస్తుతం ఐదు శాతం నుంచి ఆరు శాతం ఉద్యోగులు మాత్రమే కార్యాలయాలకు వస్తున్నారు. డిసెంబర్ నాటికి ఇరవై శాతానికి పెంచే ఆలోచన చేస్తున్నది. వారానికి కనీసం ఒకరోజు కార్యాలయానికి రావాలని, ఇది డిసెంబర్ నుంచి  అమలులోకి వస్తుందని, వారంలో ఒకరోజు లేదా రెండు రోజులు రావాలని ఉద్యోగులను కోరినట్లు సమాచారం. అయితే  కొందరికి మాత్రం అవకాశం ఇవ్వనున్నారు.

ఇంట్లో ఐదేండ్లలోపు చిన్నారులు ఉన్నవారు, 50 ఏండ్లలోపు వృద్ధులు ఉన్నవారు కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదట. అలాగే 50 లేదా 55 ఏండ్లు పైబడిన ఉద్యోగులకు కూడా మినహాయింపు ఉంది. ఉద్యోగులను కార్యాలయానికి రప్పించే అంశాన్ని దశలవారీగా పెంచేందుకు ఇప్పటికే హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ప్రణాళికలు సిద్ధంచేసింది. అందుకోసం కార్యాలయాల్లో హెచ్‌సీఎల్ టెక్ అన్ని జాగ్రత్తలు తీసుకుంతున్నది. ఒక ఉద్యోగికి మరో ఉద్యోగికి మధ్య మూడు అడుగుల దూరం ఉండేలా కొన్ని కుర్చీలను తొలగించింది. కామన్ రూమ్స్‌ను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నారు. ఉద్యోగులకు క్యాబ్ లు ఏర్పాటు చేశారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.