ఊళ్లలో ఇరుగుపొరుగు మహిళలకు అస్సలు పడదు. అప్పటివరకూ కలిసి ఉన్నట్టే ఉంటారు. కొద్దిసేపటికే తగువులాడుకుంటారు. చిన్నచిన్న విషయాలకే గొడవపడుతుంటారు. నల్లాల వద్ద నీళ్లు పటుకునే దగ్గరనుంచి వాకిళ్లు ఊడ్చుకునే వరకు కొట్లాటలు జరుగుతుంటాయి. చెత్త విషయంలో ఇద్దరు మహిళలు గొడవపడే వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో మీమ్‌ను చూసి నెటిజన్లు నవ్వాపుకోలేకపోతున్నారు.
ఈ వీడియోను ‘సక్త్లాగ్’ అనే యూజర్ ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఇందులో ఇద్దరు మహిళలు చీపుర్లతో చెత్తను ఊడుస్తూ ఉంటారు. చెత్త విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరుగుతుంది. అదికాస్తా గొడవకు దారితీస్తుంది. దీంతో ఇద్దరు మహిళలు కోపాన్ని నియంత్రించుకోలేక ఇంటి ముందు ఉన్న మోరీనీళ్లను ఒకరి ఇంట్లో ఒకరు చల్లుకుంటూ ఉంటారు. ఈ వీడియోకు సంబంధించిన మీమ్ ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నది. నెటిజన్లకు నవ్వు తెప్పిస్తున్నది. ఈ వీడియోకు నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.