న్యూఢిల్లీ: దక్షిణ ఢిల్లీలో ఇవాళ ఘోర అగ్నిప్రమాదం జరిగింది. హౌజ్ రాణి ఏరియాలో ఉన్న మికాసా ఇన్ హోటల్లో ఆ ప్రమాదం సంభవించింది. అయితే మంటలు వ్యాపిస్తున్న సమయంలో.. ఓ మహిళ పైఅంతస్తు నుంచి కిందకు దూకింది. ఈ ఘటన వీడియోకు చిక్కింది. మికాసా ఇన్‌కు చెందిన రెస్టారెంట్లో మొదలైన మంటలు ఆ తర్వాత పైకి వ్యాపించాయి. ఆ బిల్డింగ్ అయిదు అంతస్తులు ఉన్నది. మంటలు, పొగ దట్టంగా కమ్ముకున్న సమయంలో.. ఓ మహిళ ఆ హోటల్ పైనుంచి కిందకు దూకింది. ఆ బిల్డింగ్ నుంచి ఇద్దరు మహిళలు దూకినట్లు తెలుస్తోంది. ఆ మహిళలను స్థానికులు కాపాడే ప్రయత్నం చేశారు. బిల్డింగ్ వద్ద మాట్రిసెస్ ఏర్పాటు చేశారు. ఆ పరుపు బెడ్లపై ఓ మహిళ దూకిన విజువల్స్ చిక్కాయి. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది.
ఢిల్లీ రెస్టారెంట్ ఘటనలో 21 మంది మృతిచెందారు. గ్రౌండ్ ఫ్లోర్లో మంటలు అంటుకున్నాయని, అగ్ని ప్రమాదానికి కారణం ఏంటో తెలియదని దక్షిణ ఢిల్లీ ఎడీఎం అధికారి జితేంద్ర కుమార్ తెలిపారు. హోటల్ ముందున్న రోడ్డుపై వేసిన బెడ్ల మీద కొందరు దూకినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. మంటల్ని ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తోంది. ఆ హోటల్లో సుమారు 25 గదులు ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 40 మంది అతిథులు అందులో ఉన్నట్లు తెలిసింది. దీంట్లో ఎక్కువ మంది వైద్య చికిత్స కోసం వచ్చిన విదేశీయులు ఉన్నారు. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో చాలా మంది గెస్ట్‌లు నిద్రలో ఉన్నట్లు భావిస్తున్నారు. మృతుల్లో విదేశీయులు ఉన్నట్లు ఓ వార్తా సంస్థ వెల్లడించింది.
Massive fire breaks out at a restaurant in Delhi’s Malviya Nagar
A woman jumps from the building to save her life. At least 10 dead
Warning⚠️: Disturbing images pic.twitter.com/Q6pzw4nbGI
— Karan Singh / करन सिंह (@Journo_Karan) June 3, 2026