KTR | కడుపులో కత్తులు పెట్టుకుని.. పెదవులపై చిరునవ్వులు పెట్టుకునే తెలివితేటలు తనకు లేవని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అందుకే తనకు అహంకరమని అంటారేమో అని తెలిపారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీట్ ది ప్రెస్లో కేటీఆర్ పాల్గొన్నారు. మీకు అహంకారమని అంతా అనుకుంటారని ఇంటర్వ్యూల్లో చెప్పారు కదా.. దాని గురించి ఎప్పుడైనా ఆలోచిస్తారా అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు కేటీఆర్ ఈ మేరకు స్పందించారు.
నాకు అహంకారమని అంతా ఎందుకు అనుకుంటారని కచ్చితంగా ఆలోచిస్తుంటానని కేటీఆర్ తెలిపారు. అయితే కొంతమందికి కొన్ని కొన్ని మ్యాన్యుఫ్యాక్షరింగ్ డిఫెక్ట్ ఉంటాయని అన్నారు. అలాగే తనకు బాడీ లాంగ్వేజ్ సమస్య ఉందని తెలిపారు. అందుకే నవ్వుతూ మాట్లాడమని మిత్రులు చెబుతుంటారని.. కానీ అలా లేని నవ్వు తెచ్చుకుని నాకు మాట్లాడటం రాదని చెప్పారు. తెలంగాణ వాడిని కదా.. కడపులో కత్తులు, పెదవులపై చిరునవ్వులు పెట్టుకునే తెలివితేటలు తనకు లేవని స్పష్టం చేశారు.
కడుపులో కత్తులు పెట్టుకుని పెదవులపై చిరునవ్వు పెట్టుకునే అలవాటు నాకు లేదు
అందుకే నాకు అహంకారం అంటారేమో
కానీ నేను అహంకారం చూపిన సంఘటనలు చెప్పమంటే ఎవరు చెప్పరు
ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఎవరికి నచ్చదు కదా అందుకే అహంకారం అనుకుంటున్నారు
– కేటీఆర్ pic.twitter.com/Ny7xyqdCvX
— Telugu Scribe (@TeluguScribe) June 3, 2026
కొన్ని సందర్భాల్లో నిజం నిక్కచ్చిగా చెబితే ఎవరికీ నచ్చదని కేటీఆర్ తెలిపారు. నేను ఎక్కడ అహంకారం చూపించానో.. ఒక ఉదంతం చూపించమంటే ఎవరూ చెప్పరని అన్నారు. కానీ నీకు అహంకారం ఎక్కువ అని అంటారని అన్నారు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఎవరికీ నచ్చదు కదా అందుకే అహంకారం అనుకుంటున్నారని పేర్కొన్నారు. వాళ్ల మాటలు నాకు కూడా అలవాటైపోయాయని చెప్పారు.