బెంగళూరు: దేశంలో ఇప్పుడు హిజాబ్‌పై పెద్ద చర్చ జరుగుతున్నది. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ మరో భాష్యం చెప్పారు. మహిళలు తమ మఖానికి ముసుగు వేసుకోకపోవడం వల్లే దేశంలో అత్యాచారాలు పెరిగిపోతున్నాయని అన్నారు. అందుకే లైంగిక దాడి కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయని చెప్పారు.
‘హిజాబ్ ఎందుకంటే, అమ్మాయిలు పెద్దయ్యాక, వారి ముఖ అందాన్ని దాచడానికి. మహిళల అందం బయటకు కనిపించకూడదు. ప్రపంచంలోనే అత్యధిక అత్యాచార కేసులు దేశంలో నమోదవుతున్నాయని నేను భావిస్తున్నాను. మహిళలు తమ ముఖాలకు ముసుగు వేయకపోవడమే దీనికి కారణం’ అని జమీర్ అహ్మద్ అన్నారు. హిజాబ్‌ను ఇస్లాంలో పర్దా అంటారని తెలిపారు. హిజాబ్ ధరించడం తప్పనిసరి కానప్పటికీ, ఇది చాలా ఏండ్లుగా కొనసాగుతున్న ఆచారమన్నారు. హిజాబ్ ధరించకపోతే మహిళలు అత్యాచారాలకు గురవుతారని అన్నారు.
#WATCH | Hijab means 'Parda' in Islam…to hide the beauty of women…women get raped when they don't wear Hijab: Congress leader Zameer Ahmed on #HijabRow in Hubli, Karnataka pic.twitter.com/8Ole8wjLQF
— ANI (@ANI) February 13, 2022