శుక్రవారం 05 జూన్ 2020
National - May 10, 2020 , 02:02:52

‘వందే భారత్‌' విమానాలకు మహిళల సారథ్యం

‘వందే భారత్‌' విమానాలకు మహిళల సారథ్యం

కొచ్చి: కరోనా కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చే ‘వందే భారత్‌' మిషన్‌ కొనసాగుతున్నది. మలేషియా, ఒమన్‌ దేశాల్లో చిక్కుకుపోయిన వారిని తీసుకురావడానికి శనివారం రెండు ఎయిర్‌ఇండియా విమానాలు బయలుదేరాయి. ఈ రెండు విమానాలకు మహిళా కెప్టెన్లు సారథ్యం వహిస్తున్నారు. తిరుచిరాపల్లి-కౌలాలంపూర్‌ విమానానికి కెప్టెన్‌ కవితా రాజ్‌కుమార్‌ నేతృత్వం వహిస్తుండగా.. కొచ్చి-మస్కట్‌ విమానానికి కెప్టెన్‌ బిందూ సెబాస్టియన్‌ సారథ్యం వహిస్తున్నారు. మరోవైపు అబుదాబి, దుబాయ్‌ నుంచి భారత్‌కు తీసుకొచ్చిన 363 మందిలో ఇద్దరికి కరోనా ఉన్నట్లు తేలిందని కేరళ సీఎం విజయన్‌ తెలిపారు.


logo