Child Care Leave | ఆ ఉద్యోగులు 730 రోజులు చైల్డ్ కేర్ లీవ్స్ కు అర్హులు : కేంద్రం
Child Care Leave | కేంద్రం పరిధిలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల (Government Employees) శిశు సంరక్షణ సెలవులపై కేంద్రం కీలక ప్రకటన చేసింది.
Child Care Leave | కేంద్రం పరిధిలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల (Government Employees) శిశు సంరక్షణ సెలవులపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. మహిళలు, ఒంటరి పురుష ప్రభుత్వ ఉద్యోగులు 730 రోజులు చైల్డ్ కేర్ లీవ్స్ (Child Care Leave)కు అర్హులని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ (Jitendra Singh) వెల్లడించారు. ఈ మేరకు బుధవారం పార్లమెంట్లో లిఖితపూర్వకంగా తెలిపారు.
కేంద్ర వ్యవహారాలకు సంబంధించి సివిల్ సర్వీసెస్, ఇతర విభాగాల్లో నియమితులైన మహిళా, ఒంటరి పురుష ప్రభుత్వ ఉద్యోగులు.. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (లీవ్) రూల్స్ 1972లోని 43సీ ప్రకారం చైల్డ్ కేర్ లీవ్ (CCL)కి అర్హులని తెలిపారు. వారి మొదటి ఇద్దరు పిల్లలకు 18 ఏళ్లు వచ్చే వరకూ వారి సంరక్షణ కోసం మొత్తం సర్వీసులో గరిష్టంగా 730 రోజులు సెలవు తీసుకోవచ్చని వెల్లడించారు. దివ్యాంగులైన పిల్లల విషయంలో మాత్రం వయోపరిమితి లేదని చెప్పారు. ఈ మేరకు ఆయన లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయంపై స్పష్టతనిచ్చారు.
Also Read..
Mukesh Ambani | లగ్జరీ ఇంటిని అమ్మేసిన ముకేశ్ అంబానీ..! ఎన్ని కోట్లకంటే..?
Mahesh Babu | మహేష్‌కు అరుదైన గౌరవం.. నక్షత్రానికి సూపర్ స్టార్ పేరు పెట్టిన ఫ్యాన్స్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

