హైదరాబాద్: ఇంట్లో ఫంక్షన్ ఉంటే.. ఆడవాళ్లు తయార్యే తీరే వేరుంటుంది. పెండ్లిల్లకు ముస్తాబు అవ్వడం మరొకెత్తు. అందంగా కనిపించేందుకు మేకప్ వేసుకోవడం.. ఖరీదైన నగలు ధరించడం ఆడవాళ్ల ప్రత్యేకతే. ఇక ఇప్పుడు ఇన్‌స్టాలో ఓ వీడియో అందర్నీ తికమక పెట్టిస్తోంది. సీమంతం కోసం ఓ మహిళ చాలా అందరంగా తయారైంది.
పట్టు చీరను కట్టుకున్న ఆ సుందరి.. తన ఒంటి నిండా నగలు ధరించింది. అయితే ఆ నగలు అసలైనవి కావు. ఆమె వేసుకున్నది డ్రై ఫ్రూట్స్‌తో తయారైన ఆభరణాలు(Dry Fruit Jewellery). కాజు, బాదాం, పిస్తాలతో ఆభరణాలను తయారు చేశారు. బలమైన ఆహారపదార్ధాలతో చేసిన దండలను ఆమె మెడలో, సిగలో, చేతిలో వేసుకున్నది.
నక్లెస్, గాజులు, చెవిపోగులు, హెయిర్ బ్యాండ్, వడ్డాణం.. లాంటి ఆభరణాల స్టయిల్లో ఆమె డ్రై ఫ్రూట్స్, నట్స్‌తో చేసిన వస్తువులను ఆమె ధరించింది. ఇప్పుడు ఆ వీడియో ఇన్‌స్టాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోను ఇప్పటికే కోటి మందికిపైగా చూశారు.