propeller hits Trainee pilot | తిరుగుతున్న ప్రొపెల్లర్ తగిలి.. మహిళా ట్రైనీ పైలట్‌కు గాయాలు
propeller hits Trainee pilot | శిక్షణలో భాగంగా విమానం నడిపిన మహిళా ట్రైనీ పైలట్ ల్యాండింగ్ తర్వాత ఇంజిన్ ఆన్‌లో ఉండగానే కిందకు దిగింది. దీంతో తిరుగుతున్న ప్రొపెల్లర్ ఆమె వెనుక భాగానికి తగలడంతో గాయపడింది. ఆ మహిళను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
లక్నో: శిక్షణలో భాగంగా విమానం నడిపిన మహిళా ట్రైనీ పైలట్ ల్యాండింగ్ తర్వాత ఇంజిన్ ఆన్‌లో ఉండగానే కిందకు దిగింది. దీంతో తిరుగుతున్న ప్రొపెల్లర్ ఆమె వెనుక భాగానికి తగలడంతో గాయపడింది. ఆ మహిళను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. (propeller hits Trainee pilot) ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఈ సంఘటన జరిగింది. జూన్ 26న కాన్పూర్‌లోని చకేరి విమానాశ్రయంలో గార్గ్ ఏవియేషన్‌కు చెందిన ట్విన్ ఇంజిన్ విమానంలో మహిళా ట్రైనీ పైలట్ రాత్రిపూట శిక్షణ పొందింది. ఆమెతో పాటు ఫ్లైట్ ఇన్స్ట్రక్టర్ కూడా అందులో ఉన్నారు.
కాగా, ఆ విమానం ల్యాండింగ్ తర్వాత ఇంజిన్ ఆన్‌లో ఉండగానే మహిళా ట్రైనీ పైలట్ కిందకు దిగింది. దీంతో తిరుగుతున్న విమానం ప్రొపెల్లర్ ఆమె వీపు భాగానికి తగలడంతో గాయపడింది. ఆ ట్రైనీ పైలట్‌ను కాన్పూర్‌లోని ఆసుపత్రిలో అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) దీనిపై విచారణ చేపట్టింది. విచారణ పూర్తయ్యే వరకు సంబంధిత ఇన్స్ట్రక్టర్ను ఫ్లైయింగ్ ట్రైనీ విధులకు దూరంగా ఉంచాలని ఆదేశించింది. అలాగే విచారణ కొనసాగుతున్నంత కాలం ఆ విమానాన్ని వినియోగించకూడదని కూడా ఆదేశించినట్లు డీజీసీఏ పేర్కొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

