పనాజీ, జనవరి 19: ఉత్తర గోవా లో శనివారం జరిగిన పారాైగ్లెడింగ్ ప్రమాదంలో ఓ పర్యాటకురాలు, ఓ శిక్షకుడు దుర్మరణం చెందారు. పోలీసుల కథనం ప్రకారం ఈ ఘటన శనివారం సాయంత్రం జరిగింది. పుణె నివాసి శివాని దబ్లే(27), నేపాలీ శిక్షకుడు సుమల్ నేపాలీతో కలిసి కెరి పీఠభూమి వద్ద పారాైగ్లెడింగ్ చేస్తున్నప్పు డు ఈ దుర్ఘటన జరిగింది.
ఓ కొండ పైనుంచి ఎగిరిన వెంటనే శివాని, సుమల్ పక్కనే ఉన్న లోయలో పడిపోయారు. చట్టవిరుద్ధంగా నిర్వహిస్తున్న సాహస క్రీడల సంస్థతో శివాని పారాైగ్లెడింగ్ చేశారు. సదరు సంస్థ యజమాని శేఖర్ రైజాదాపై పోలీసులు కేసు నమోదు చేశారు.