న్యూఢిల్లీ: నోయిడాలో మళ్లీ కుక్క గోల(Dog Issue) మొదలైంది. అక్కడి అపార్ట్మెంట్లో తాజాగా ఓ ఘటన జరిగింది. దానికి చెందిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. పెంపుడు కుక్కను లిఫ్ట్‌లో తీసుకు వెళ్లడాన్ని అడ్డుకున్న ఓ సీనియర్ సిటిజన్‌పై మహిళ అటాక్ చేసింది. సెక్టార్ 108లో ఉన్న పార్క్ లారేట్ అపార్ట్మెంట్లో ఈ ఘటన జరిగింది. రిటైర్డ్ మాజీ ఐఏఎస్ అధికారితో పాటు ఓ మహిళ .. ఆ లిఫ్ట్ వద్దే ఒకరిపై ఒకరు చేయిచేసుకున్నారు. తమ చేతుల్లో ఉన్న ఫోన్లను లాగేసుకున్నారు. ఈ ఘటనకు చెందిన వివరాలు ఇలా ఉన్నాయి.
Kalesh b/w a Retired IAS officer and a woman in a dispute over taking a dog in the lift in Park Larette Society, Noida Sector-108.
pic.twitter.com/sfd4ippceg— Ghar Ke Kalesh (@gharkekalesh) October 31, 2023
ఓ మహిళ లిఫ్ట్‌లో తమ పెంపుడు కుక్కను తీసుకువెళ్లేందుకు ప్రయత్నించింది. ఆ సమయంలో అక్కడే ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఆమెను నివారించాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తమ ఫోన్లలో ఈ ఘటనను బంధించేందుకు ఇద్దరూ ప్రయత్నించారు. లిఫ్ట్ వద్ద ఉన్న మహిళ ఆ సీనియర్ సిటిజన్ చేతుల్లో ఉన్న ఫోన్‌ను లాగేసుకున్నది. ఆ సమయంలో ఆ వ్యక్తి మహిళపై చేయి చేసుకున్నారు. దీంతో ఇద్దరి మధ్య భౌతిక ఘర్షణ మొదలైంది. కాసేపటికి ఆ మహిళ భర్త సీన్లోకి ఎంటరయ్యాడు. మళ్లీ ఒకరిపై ఒకరు చేయిచేసుకున్నారు.
గొడవ గురించి తెలుసుకున్న పోలీసులు ఆ అపార్ట్‌మెంట్‌కు వెళ్లారు. సీసీటీవీ ఫూటేజ్‌ను పరిశీలించారు. రెండు వర్గాలు రాతపూర్వక అగ్రిమెంట్‌ను సమర్పించారు. ఎవరిపైనా ఎటువంటి చర్యలు తీసుకోవద్దు అని వేడుకున్నారు.