న్యూఢిల్లీ: వీల్‌చైర్‌లోని దివ్యాంగురాలిని (Woman On Wheelchair) నిలబడాలని ఎయిర్‌పోర్ట్‌లో బలవంతం చేశారు. పుట్టుక నుంచే వీల్‌చైర్‌కు పరిమితమైనట్లు ఆమె చెప్పినప్పటికీ సెక్యూరిటీ సిబ్బంది పట్టించుకోలేదు. లేచి నిల్చోవాలని మూడుసార్లు ఆమెను అడిగారు. దివ్యాంగురాలైన ఆ మహిళ తనకు ఎదురైన ఈ అవమానం గురించి సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేసింది. బుధవారం సాయంత్రం కోల్‌కతా విమానాశ్రయంలో తనిఖీ సందర్భంగా వీల్‌చైర్‌లో ఉన్న తనను లేచి నిలబడమని సీఐఎస్ఎఫ్ సిబ్బంది అడిగారని దివ్యాంగురాలైన అరుషి సింగ్ ఆరోపించింది. ఒక్కసారి కాదు మూడుసార్లు నిల్చోవాలని మహిళా భద్రతా సిబ్బంది అడిగినట్లు పేర్కొంది. తనకు అంగవైకల్యం ఉన్నందున లేవలేనని చెప్పినప్పటికీ కనీసం రెండు నిమిషాలైనా నిల్చోవాలని డిమాండ్ చేసినట్లు న్యాయ విద్యార్థి అయిన ఆమె ఎక్స్‌లో పోస్ట్ చేసింది. దివ్యాంగుల పట్ల కనీస ఉదారత చూపించకపోవడం తనను ఆవేశానికి గురిచేసిందని వాపోయింది.
కాగా, వైకల్యం ఉన్నవారిని ఇలా అవమానించాలని సీఐఎస్ఎఫ్ మాన్యువల్‌లో ఉందా? అని అరుషి సింగ్ ప్రశ్నించింది. అలాగే తనకు వీల్‌చైర్ సహాయం అందించడంలో కూడా 20 నిమిషాలు ఆలస్యం జరిగిందని తెలిపింది. కోల్‌కతా విమానాశ్రయంలో గతంలో కూడా ఇలాంటి అవమానాలు ఎదుర్కొన్నట్లు ఆమె ఆరోపించింది. దివ్యాంగ ప్రయాణికుల పట్ల కోల్‌కతా ఎయిర్‌పోర్టు అధికారుల విధానంపై పునరాలోచించుకోవాల్సి ఉందని ఆ పోస్ట్‌లో పేర్కొంది. అయితే కోల్‌కతా ఎయిర్పోర్ట్ అధికారులు ఈ పోస్ట్‌పై ఇంత వరకు స్పందించలేదు.
Told her I can’t as I have a disability. Inside she again asked me to stand up. I said I can’t. She said sirf 2 minute khade ho jao. I explained again that I have a disability by birth. (2/1)
— Arushi Singh (@singhharushi) February 1, 2024
Once at the lounge no one came to escort me to the gate. There is an urgent need to re-look at the treatment of passengers with disabilities by the Kolkata airport authorities. @JM_Scindia #Disability #InclusionMatters #Diversity
— Arushi Singh (@singhharushi) February 1, 2024