లక్నో: ఒక మహిళ తన బంధువైన ప్రియుడు, అతడి స్నేహితుడితో కలిసి భర్తను హత్య చేసింది. ఆ తర్వాత మృతదేహాన్ని రెండు ముక్కలుగా నరికారు. ట్రాలీ బ్యాగ్‌లో కుక్కి పొలాల్లో పడేశారు. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. (With Lover, Wife Kills Husband) చివరకు ఆ మహిళను అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం ఉదయం పకారి ఛపర్ పట్ఖౌలి గ్రామంలోని పొలంలో పడేసిన ట్రాలీ బ్యాగ్‌ను కొందరు వ్యక్తులు గమనించారు. అందులో వ్యక్తి మృతదేహం భాగాలు ఉండటం చూసి షాకయ్యారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా అక్కడకు చేరుకున్నారు. ఫోరెన్సిక్ బృందాలు, డాగ్ స్క్వాడ్‌ను రప్పించారు. ట్రాలీ బ్యాగ్‌కు ఉన్న ఎయిర్ ట్రావెల్ ట్యాగ్, అడ్రస్ ఆధారంగా మృతుడ్ని 30 ఏళ్ల నౌషాద్‌గా గుర్తించారు. గల్ఫ్‌లో ఉద్యోగం చేస్తున్న అతడు గత వారం సొంతూరుకు తిరిగి వచ్చినట్లు తెలుసుకున్నారు.
కాగా, నౌషాద్ భార్య, 30 ఏళ్ల రజియా సుల్తానాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెను ప్రశ్నించగా ప్రియుడు, మేనల్లుడైన 27 ఏళ్ల రోమన్‌తో సంబంధానికి అడ్డుగా ఉన్నందుకు భర్తను హత్య చేసినట్లు తెలిపింది. తాను, రోమన్, అతడి స్నేహితుడు హిమాన్షు కలిసి పదునైన ఆయుధంతో నౌషాద్‌ను చంపినట్లు చెప్పింది. మృతదేహాన్ని రెండు ముక్కలుగా నరికి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కి ఇంటికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న పొలంలో పడేసినట్లు ఒప్పుకున్నది.
మరోవైపు రజియా సుల్తానా చెప్పింది విని పోలీసులు షాక్ అయ్యారు. ఆమెను అరెస్ట్ చేశారు. హత్యకు వినియోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న రోమన్, హిమాన్షు కోసం వెతుకుతున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. నౌషాద్ సోదరి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే భార్య, ఆమె ప్రియుడి చేతుల్లో భర్తలు వరుసగా హత్యకు గురికావడం ఉత్తరప్రదేశ్‌లో కలకలం రేపుతున్నది.
उत्तर प्रदेश : जिला देवरिया ने पत्नी ने बॉयफ्रेंड भांजे संग मिलकर पति नौशाद की हत्या कर दी और लाश सूटकेस में पैक करके 50 KM दूर फेंक दी।
नौशाद सऊदी अरब में रहकर कमाता था। इधर, पत्नी के भांजे से संबंध हो गए। एक हफ्ते पहले ही वो सऊदी से लौटा तो मर्डर कर डाला।
खबर सौजन्य… pic.twitter.com/YWYaGfyfIl
— Anurag Verma ( PATEL ) (@AnuragVerma_SP) April 21, 2025