బెంగుళూరు: కర్నాటక రాజధాని బెంగుళూర్లో దారుణ మర్డర్ జరిగింది. సహజీవనం(Live in Partner) చేస్తున్న వ్యక్తి.. మహిళను చంపేశాడు. ఆమె శరీరాన్ని చెత్తకుండి ట్రక్కులో పడేశాడు. బాధితురాలను ఆశగా గుర్తించారు. నిందితుడిని మొహమ్మద్ షామ్షుద్దిన్గా తేల్చారు. బృహత్ బెంగుళూరు మహానగర పాలిక(బీబీఎంపీ) గార్బేజ్ ట్రక్కులో మహిళ శవాన్ని దాచిన గన్నీ బ్యాగ్‌ను పసికట్టారు. ఆ మహిళ చేతులు కట్టి ఉన్నాయి. బెంగుళూరు పోలీసులు కేసును రిజిస్టర్ చేసి ఆమె మృతదేహాన్ని అటాప్సీ కోసం ఆస్పత్రికి పంపారు. తదుపరి విచారణ కొనసాగుతున్నది.
సీసీటీవీ ఫూటేజ్, ఇతర ఆధారాలతో నిందితుడు 33 ఏళ్ల షామ్షుద్దిన్ను గుర్తించారు. అతనిది అస్సాం రాష్ట్రం. ఏడాదిన్నర నుంచి ఆశా అనే మహిళతో అతను రిలేషన్లో ఉన్నాడు. హులిమావు ప్రాంతంలోని ఓ ఇంట్లో ఆ ఇద్దరూ అద్దెకు ఉంటున్నారు. నిందితుడు షామ్షుద్దిన్కు భార్య, పిల్లలు ఉన్నారు. వాళ్లు అస్సాంలో ఉన్నారు. హౌజ్‌కీపింగ్ పనులు చేసే ఆశ భర్తను కోల్పోయింది. గత ఏడాది నుంచి అస్సాం వ్యక్తితో కలిసి ఉంటోంది. ఇద్దరూ భార్యభర్తల రీతిలో కలిసి తిరిగేవారు.
ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని, దాంతో అతను భౌతిక దాడికి పాల్పడ్డాడని, ఆశ గొంతును నొక్కి చంపేశాడని డీసీపీ లోకేశ్ జగలాసర్ తెలిపారు. భాగస్వామిని చంపిన తర్వాత ఆమె డెడ్‌బాడీని బైక్‌పై పెట్టుకుని, చెత్త మోసుకెళ్లే ట్రక్కులో పడేశాడు. సీసీటీవీలో ఆ దృశ్యాం రికార్డు అయ్యింది. నిందితుడిని అరెస్టు చేశారు.