Woman Gang Raped | దారుణం.. యువతికి బలవంతంగా మద్యం తాగించి సామూహిక అత్యాచారం.. ఐదుగురు అరెస్ట్
Woman Gang Raped | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. ప్రముఖ పర్యాటక ప్రదేశమైన ఆగ్రా (Agra)లో ఓ యువతిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి (Woman Gang Raped) పాల్పడ్డారు.
Woman Gang Raped | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. ప్రముఖ పర్యాటక ప్రదేశమైన ఆగ్రా (Agra)లో ఓ యువతిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి (Woman Gang Raped) పాల్పడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులను పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు.
ఆగ్రాలోని ఓ హోటల్ (Agra Hotel)లో పనిచేస్తున్న 25 ఏళ్ల యువతిపై గత శనివారం నలుగురు వ్యక్తులు సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెను ఓ రిచ్ హోమ్‌స్టేకి తీసుకెళ్లి బలవంతంగా మద్యం తాగించారు. అనంతరం సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఆగ్రా సదర్ ఎస్పీ అర్చనా సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఓ మహిళపై అత్యాచారం, దాడి జరిగినట్లు శనివారం రాత్రి తాజ్‌గంజ్ పోలీసులకు (Tajganj police) ఫోన్ కాల్ వచ్చింది. దీంతో వారు వెంటనే అక్కడికి చేరుకొని.. బాధితురాలిని రక్షించారు. నిందితులు తనకు సంబంధించిన ఓ అభ్యంతరకరమైన వీడియోను రూపొందించారని, దాని ద్వారా తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు బాధిత యువతి పోలీసులకు వెల్లడించింది. బలవంతంగా తనకు మద్యం తాగించారని, గాజు సీసాతో బలంగా తలపై కొట్టారని పోలీసుల ముందు వాపోయింది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఈ ఘటనలో ఓ మహిళ సహా మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. నిందితులంతా ఆగ్రాకు చెందిన వారే అని పేర్కొన్నారు. వారిపై అత్యాచారం సహా పలు సెక్షన్ల కింద కేసులు బుక్ చేసినట్లు వెల్లడించారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించి, ఈ కేసులో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆగ్రా సదర్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ అర్చనా సింగ్ తెలిపారు.
Also Read..
SUV Hits 3 Bikes | ద్విచక్ర వాహనాలపైకి దూసుకెళ్లిన కారు.. నలుగురికి గాయాలు.. VIDEO
Leopard | పటాకుల శబ్దానికి భయపడిన చిరుత.. 15 గంటల పాటూ ఇంట్లోనే నక్కి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

