SUV Hits 3 Bikes | ద్విచక్ర వాహనాలపైకి దూసుకెళ్లిన కారు.. నలుగురికి గాయాలు.. VIDEO
SUV Hits 3 Bikes | ట్రాఫిక్ నగరంగా పేరుగాంచిన కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru)లో ఓ ఎస్యూవీ కారు బీభత్సం సృష్టించింది. రద్దీగా ఉన్న రహదారిపై అతివేగంగా వెళ్తూ.. ద్విచక్ర వాహనాలపైకి దూసుకెళ్లింది.
SUV Hits 3 Bikes | ట్రాఫిక్ నగరంగా పేరుగాంచిన కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru)లో ఓ ఎస్యూవీ కారు బీభత్సం సృష్టించింది. రద్దీగా ఉన్న రహదారిపై అతివేగంగా వెళ్తూ.. ద్విచక్ర వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో పలువురు వాహనదారులు తీవ్రంగా గాయపడ్డారు.
దీపావళి రోజు సాయంత్రం స్థానిక హులిమావు ప్రాంతం (Hulimavu area)లో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రద్దీగా ఉన్న రహదారిపై తెల్లటి ఎస్యూవీ కారు అతి వేగంగా వెళ్తూ.. ముందు ఉన్న మూడు ద్విచక్ర వాహనాలని ( SUV Hits 3 Bikes) బలంగా ఢీ కొట్టినట్లు చెప్పారు. కారు ముందుగా ఒక ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీ కొడుతుంది. దీంతో ఆ వాహనదారుడు గాల్లోకి ఎగిరి కొన్ని అడుగుల దూరంలో రెండు కార్ల మధ్య పడిపోతాడు. ఆ తర్వాత అదే వేగంతో రెండో బైక్‌ను కారు ఢీ కొడుతుంది. రెండో బైక్‌పై ప్రయాణిస్తున్న వారు ఎగిరి ఫుట్‌పాత్‌పై పడిపోతారు. ఆ తర్వాత కారు అలాగే ఆగకుండా అదే వేగంతో మరో బైక్‌ను కూడా ఢీకొంటుంది.
మొత్తం ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఘటన తర్వాత ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ అక్కడి నుంచి పరారైనట్లు చెప్పారు. అతడి కోసం గాలింపు చేపట్టినట్లు వివరించారు. మరోవైపు ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Four individuals sustained injuries when an SUV collided with three motorcycles in Bengaluru. #BengaluruAccident #SUVCollision #DashcamCapture #HulimavuIncident #Injury #HitAndRun #Traffic #SUV #accident #Bengaluru #Bangalore pic.twitter.com/yednGTBWjJ
— Ceptor World (@CeptorW) November 13, 2023
Also Read..
Leopard | పటాకుల శబ్దానికి భయపడిన చిరుత.. 15 గంటల పాటూ ఇంట్లోనే నక్కి
Silent Diwali | అక్కడ 22 ఏళ్లుగా నిశ్శబ్ద దీపావళి.. ఆదర్శంగా నిలుస్తున్న ఆ ఏడు గ్రామాలు
Diwali Celebrations | కుటుంబంతో కలిసి దీపావళిని సెలబ్రేట్ చేసుకున్న రిషి సునాక్.. వీడియో
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

