Viral Video | భోజ్‌పురి సాంగ్‌కు ట్రైన్లో యువతి డ్యాన్స్ : ఇదేం పనంటూ ఓ రేంజ్లో ఆడుకున్న నెటిజన్లు
మెట్రో రైళ్లు, రైల్వే ప్లాట్‌ఫాం సహా బహిరంగ ప్రదేశాల్లో డ్యాన్స్‌లు చేస్తూ ఆ వీడియోలను (Viral Video) సోషల్ మీడియాలో షేర్ చేసే ట్రెండ్ ప్రబలుతోంది.
కోల్‌కతా : మెట్రో రైళ్లు, రైల్వే ప్లాట్‌ఫాం సహా బహిరంగ ప్రదేశాల్లో డ్యాన్స్‌లు చేస్తూ ఆ వీడియోలను (Viral Video) సోషల్ మీడియాలో షేర్ చేసే ట్రెండ్ ప్రబలుతోంది. ఇలాంటి ఘటనలు ప్రజలకు ఇబ్బందికరమే కాకుండా కొన్నిసార్లు ప్రమాదాలనూ కొనితెచ్చేలా మారుతున్నాయి. ఇక లేటెస్ట్గా పశ్చిమ బెంగాల్లో ప్రయాణీకులతో రద్దీగా ఉన్న ట్రైన్లో ఓ యువతి ప్రముఖ భోజ్‌పురి సాంగ్‌కు డ్యాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ వీడియోలో కనిపించిన యువతిని కోల్‌కతాకు చెందిన ఇన్స్టాగ్రాం ఇన్ఫ్లుయన్సర్ సహేలి రుద్రగా గుర్తించారు. ఈమెకు ఇన్‌స్టాలో ఏకంగా 8.4 లక్షల ఫాలోవర్లు ఉన్నారు. ఈ వీడియోలో ఆమె షర్ట్, చినిగిన జీన్స్‌తో కేసరిలాల్ యాదవ్ సజ్ కే సవార్ కే సాంగ్‌కు అలవోకగా డ్యాన్స్ చేయడం చూడొచ్చు. ప్రయాణీకుల మధ్యన ఉండే కొద్దిపాటి ప్రదేశంలోనే ఆమె డ్యాన్స్ చేసింది.
ఈ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసినప్పటి నుంచి 2.5 లక్షల మంది లైక్ చేయగా, ఏకంగా 1.1 కోట్ల మంది ఈ క్లిప్‌ను వీక్షించారు. ఈ వీడియోపై పెద్దసంఖ్యలో నెటిజన్లు రియాక్టయ్యారు. కొందరు నెటిజన్లు ఆమె ఆత్మ విశ్వాసాన్ని ప్రశంసించగా రీల్ చేసేందుకు యువతి ఎంచుకున్న లొకేషన్ సరైంది కాదని మరికొందరు తప్పుపట్టారు. బహిరంగ ప్రదేశాల్లో డ్యాన్స్ వీడియోలు చేయడం న్యూసెన్స్ అని పలువురు యూజర్లు మండిపడ్డారు. ఈ ట్రెండ్‌ను నిలిపివేయండని కోరారు.
Read More :
Couple’s Murder | పెద్దల ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్న జంట.. మూడు రోజులకే దారుణంగా హత్య
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rohan Rane: మైనర్ అమ్మాయిల లైంగిక వేధింపులు.. ఫ్రాన్స్‌లో భారతీయుడికి 20 ఏళ్ల జైలుశిక్ష
Comrade Kalyan | శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’కు మంచి ఓపెనింగ్స్.. తొలిరోజే రూ.4 కోట్లకు పైగా వసూళ్లు!
CJP Protest: సీజేపీ నిరసన వేళ 500 మంది అరెస్టు.. 20 వేల మందితో బందోబస్తు.. మోదీ ఓడారన్న దీప్కే
Jabardasth Babu | మొదట్లో బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది, ఇప్పుడు పెళ్లికి రెడీ అయింది.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ వైరల్!
Darshan | దర్శన్‌కు మరో ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టులో విజయలక్ష్మి పిటిషన్ తిరస్కరణ
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

