న్యూఢిల్లీ : వెడ్డింగ్ డ్రస్సుల్లో ఆరుగురు కూతుళ్లతో కలిసి డిన్నర్‌కు వెళ్లిన మహిళ ఉదంతం సోషల్ మీడియాలో (Viral Video) ప్రస్తుతం తెగ వైరలవుతోంది. అలెక్సిస్ హోస్టన్ ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసింది. అలెక్సిస్ తన తల్లితో పాటు ఐదుగురు సిస్టర్స్‌తో కలిసి అందరూ వెడ్డింగ్ డ్రెస్సులతో మెరిసిపోతూ స్పెషల్ డిన్నర్లో కనువిందు చేశారు.
ఈ వీడియోను ఇన్స్టాగ్రాం యూజర్లు లైక్ చేయడంతో ఏకంగా 50 లక్షలకు పైగా వ్యూస్ లభించాయి. ఎంతో ఖరీదైన వెడ్డింగ్ డ్రెస్‌లను మనం జీవితంలో ఒకసారి లేదా ఒకట్రెండు ఈవెంట్స్‌లో వాడి ఆపై అటకెక్కిస్తామని అలెక్సిస్ చెబుతూ తాము పెండ్లి దుస్తుల్లో ఎందుకు బయటకు వచ్చామో వెల్లడిస్తూ క్యాప్షన్ ఇచ్చారు. అత్యంత ఖరీదైన డ్రస్‌లను మనం ధరించేందుకు అర్హులమని, కేవలం దీన్ని మన జీవితాల్లో ఒకేఒక రోజుకు పరిమితం చేయకూడదని తాము నిర్ణయించామని, ప్రతి ఒక్కరూ దీన్ని పాటించాలని అలెక్సిస్ రాసుకొచ్చారు. దీన్ని ప్రతి ఏటా జరిగే ఆనవాయితీగా మార్చాలని తాము నిర్ణయించామని చెప్పారు.
ఇక ఈ వీడియోకు ఇన్స్టాగ్రాం యూజర్ల నుంచి మిశ్రమ స్పందన లభించింది. వెడ్డింగ్ దుస్తులను ఎన్నిసార్లు ధరిస్తారని కొందరు యూజర్లు ప్రశ్నించగా, పాత బట్టలు ఇప్పటికీ వారికి ఎలా ఫిట్ అయ్యాయని మరికొందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తాను ప్రతి ఏటా తమ పెండ్లి రోజున వెడ్డింగ్ డ్రెస్ ధరిస్తానని ఓ యూజర్ రాసుకొచ్చారు. వెడ్డింగ్ డ్రెస్ వారికి ఇప్పటికీ ఫిట్ అవడం ఆశ్చర్యకరమని మరో యూజర్ కామెంట్ చేశారు.
Read More
Megha Akash | పెళ్లి పీటలెక్కనున్న మరో టాలీవుడ్ భామ.. క్రేజీ గాసిప్‌లో నిజమెంత..?