Megha Akash | నితిన్ హీరోగా వచ్చిన లై సినిమాతో తొలిసారి సిల్వర్ స్క్రీన్‌పై మెరిసింది చెన్నై సుందరి మేఘా ఆకాశ్ (Megha Akash). ఈ సినిమా ఆశించిన స్థాయిలో టాక్ తెచ్చుకోలేకపోయింది. ఆ తర్వాత హిందీ, తమిళ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ ఫుల్ బిజీగా మారిపోయింది. ఈ ఏడాది తెలుగులో రవితేజ నటించిన రావణాసురలో వన్ ఆఫ్ ది ఫీ మేల్ లీడ్ రోల్లో నటించగా.. డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.
హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా ప్రొఫెషనల్‌గా బిజీగా ఉన్న ఈ భామ వ్యక్తిగత జీవితంలో కీలక ముందడుగు వేయనుందట. మేఘా ఆకాశ్ పెళ్లి (Tie the knot) పీటలెక్కనుందన్న వార్త ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. ప్రముఖ రాజకీయవేత్త కుమారుడిని మేఘా ఆకాశ్ వివాహం చేసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై మేఘా ఆకాశ్ నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదు. మరి పెళ్లి వార్తలు పుకార్లేనా..? నిజమా..? అనే దానిపై మేఘా ఆకాశ్ ఏమైనా క్లారిటీ ఇస్తుందేమో చూడాలంటున్నారు సినీ జనాలు. హీరోయిన్ లావణ్య త్రిపాఠి, టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ జూన్ 9న జరుగనున్న విషయం తెలిసిందే.
మేఘా ఆకాశ్ ప్రస్తుతం శివ కందుకూరి నటిస్తోన్న మను చరిత్రలో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. భరత్ పెదగాని డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ఎక్కడ ఉంటాదిరో ఆ పిల్లా (Ekkada Untadhiro Aa Pilla), హమేషా హమేషా (Hamesha Hamesha Song), హఠాత్తుగా (Hatatthuga) పాటలు మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటున్నాయి. తెలుగులో మరో సినిమాతోపాటు తమిళంలో కూడా ఓ ప్రాజెక్ట్ చేస్తోంది.