న్యూఢిల్లీ, ఆగస్టు 14: దేశ ప్రజలకు ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మన రాజ్యాంగ ఆదర్శాలైన న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం సాధించేందుకు ప్రజలంతా కలిసి పనిచేయాలని కోరారు. దేశానికి స్వాతంత్య్రాన్ని సాధించిపెట్టిన నాయకుల త్యాగాలు, సాహసాలను గుర్తుచేసుకోవాలని చెప్పారు. అభివృద్ధి ఫలాలను ప్రతి పౌరుడికి అందించటం, అందరూ గౌరవప్రదంగా జీవించేలా చూడటంపై దేశ పురోగతి అధారపడి ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.