భోపాల్: ప్రపంచ కాలమాన ప్రమాణాన్ని (వరల్డ్ స్టాండర్డ్ టైమ్) ఇంగ్లండ్‌లోని గ్రీనిచ్ నుంచి మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినికి మార్చేందుకు కృషి చేస్తామని మధ్యప్రదేశ్ నూతన సీఎం మోహన్ యాదవ్ ప్రకటించారు. ప్రపంచ సమయాన్ని 300 ఏండ్ల క్రితమే భారత్ నిర్దేశించిందని ఆయన స్పష్టం చేశారు.
అనంతరం పారిస్ సమయాన్ని పొందడం ప్రారంభించిందని, ఆ తర్వాత బ్రిటిష్‌వారు ప్రపంచ ప్రామాణిక సమయాన్ని గ్రీనిచ్‌కు మార్చారని చెప్పారు. భూగోళ ఉత్తర, దక్షిణ ధృవాలకు సరిగ్గా మధ్యలో ఉన్న ప్రాంతాల్లో ఉజ్జయిని ప్రధానమైనదని నిరూపించడం ద్వారా ప్రపంచ సమయాన్ని సవరించేందుకు కసరత్తు చేస్తున్నట్టు వెల్లడించారు.