త్రిస్సూర్: కేరళలోని అధికార పార్టీకి చెందిన విద్యార్థి సంఘం నాయకులు ఓ ఇజినీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్‌ను మోకాళ్లు విరగ్గొడుతాం అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. విద్యార్థి పట్ల అసభ్యంగా ప్రవర్తించడాని ఆరోపిస్తూ త్రిస్సూర్‌లోని మహారాజాస్ టెక్నలాజికల్ ఇన్స్టిట్యూట్ పీ ప్రదీప్‌పై కాలేజీ ప్రిన్సిపాల్‌పై దాదాగిరి చేశారు. ఆఫీస్‌లోకి వెళ్తున్న అతడిని.. వెంటనే బయటకి రావాలని.. లేకపోతే మోకాళ్లు విరగ్గొడతానని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి హుస్సేన్ ముబారక్ హెచ్చరించాడు. దీంతో బయటకు వెళ్లిన అతడితో వాగ్వాదానికి దిగారు. ఈ వ్యవహారంమంతా అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో నమోదయింది.
గత నెల 25న కాలేజీలో ఓ విద్యార్థి పట్ల అనుచితంగా ప్రవర్తించాడని ఆరోపించారు. క్యాప్ ధరించి కాలేజీకి వచ్చిన ఆ విద్యార్థిని.. టోపీ తీయాలని ఆదేశించాడన్నారు. అయితే అతడు స్పల్స్ సోరియాసిస్‌తో బాధపడుతున్నాడని, వైద్యులు దుమ్ము, సూర్యరశ్మి నుంచి దూరంగా ఉండాలని చెప్పడంతోనే టోపీ ధరించడని విద్యార్థి సంఘం నాయకులు వెల్లడించారు.
కాగా, తనను విద్యార్థులు బెదిరించడంపై కాలేజీ ప్రిన్సిపాల్ పోలీసును ఆశ్రయించాడు. సీసీటీవీ ఫుటేజీని వారికి సమర్పించారు. దీంతో ఎస్ఎఫ్ఐ లీడర్ హుస్సెన్ ముబారక్‌తో సహా ఆరుగురిపై కేసు నమోదుచేశారు.