Divorce | విడాకుల కోసం ఐదేండ్లు పోరాడి.. కోర్టు తీర్పునకు ముందు మళ్లీ ఒక్కటైన జంట!
Divorce | కోర్టు రూమ్‌లో ఒక మహిళ తన చేతిలోని విడాకుల పత్రాలను చింపేసి, గుండెల నిండా భావోద్వేగంతో అక్కడే ఉన్న తన భర్త దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లి అతనిని కౌగలించుకోవడంతో ఆ జంట ఐదేండ్ల విడాకుల పోరాటం సుఖాంతమైంది. 2020లో వివాహ బంధంతో ఒక్కటైన శిఖ, సౌరభ్‌ల మధ్య కొద్ది కాలానికే విభేదాలు చోటుచేసుకున్నాయి.
Divorce | న్యూఢిల్లీ : కోర్టు రూమ్‌లో ఒక మహిళ తన చేతిలోని విడాకుల పత్రాలను చింపేసి, గుండెల నిండా భావోద్వేగంతో అక్కడే ఉన్న తన భర్త దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లి అతనిని కౌగలించుకోవడంతో ఆ జంట ఐదేండ్ల విడాకుల పోరాటం సుఖాంతమైంది. 2020లో వివాహ బంధంతో ఒక్కటైన శిఖ, సౌరభ్‌ల మధ్య కొద్ది కాలానికే విభేదాలు చోటుచేసుకున్నాయి. దీంతో వీరిద్దరూ విడాకులకు సిద్ధపడి, కోర్టు మెట్లెక్కారు. కుమార్తెకు చట్టపరమైన మద్దతు అందించేందుకు శిఖ తండ్రి తన పొదుపు మొత్తాన్ని ఖర్చు చేశారు. అనుకోని విధంగా అతను గుండెపోటుకు గురయ్యారు.
విషయం తెలుసుకున్న సౌరభ్ తన భార్యతో ఏర్పడిన వివాదాలను పక్కన పెట్టి, మానవత్వంతో ఆమె తండ్రిని ఒక ప్రైవేట్ దవాఖానలో చేర్పించి వైద్య సహాయం అందించారు. దీంతో ఆయన అనారోగ్యం నుంచి కోలుకున్నారు. అయితే ఆ మర్నాడే శిఖ, సౌరభ్‌లు తమ విడాకుల కేసు కోసం కోర్టుకు హాజరు కావలసి వచ్చింది. విచారణ సందర్భంగా జడ్జి సౌరభ్‌తో ‘విడాకులు కావాలా?’ అని అడిగారు. అతను సమాధానం చెప్పేముందు భార్య శిఖవైపు చూసి చిన్నగా నవ్వాడు. అంతే ఆమె తన చేతిలోని విడాకుల పత్రాలను చింపేసి, పరుగుపరుగున భర్త దగ్గరకు వచ్చి కౌగలించుకుంది. దీంతో శిఖ, సౌరభ్‌లు కొంగొత్త ఆశలతో కొత్త జీవితానికి నాంది పలికారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

