బెంగళూరు : కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ (68) హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. పోలీసు వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం, ఆయన, ఆయన భార్య పల్లవి ఆదివారం ఆస్తి విషయంలో గొడవపడ్డారు. అనంతరం ఆమె ఆయన కంట్లో కారం పొడి జల్లి, ఆయనను కత్తితో అనేకసార్లు పొడిచింది. ఆయన చనిపోయిన తర్వాత తన ఫ్రెండ్‌కు వీడియో కాల్ చేసి, ‘రాక్షసుడిని చంపేశాను’ అని చెప్పింది. వీరు హెచ్ఎస్ఆర్ లే అవుట్లో మూడంతస్థుల ఇంట్లో నివసిస్తున్నారు. మరోవైపు పల్లవికి స్కిజో ఫ్రేనియా వ్యాధి ఉన్నట్లు తెలుస్తున్నది. ప్రకాశ్ భార్య పల్లవి, వారి కుమార్తె కృతిలను అరెస్ట్ చేశారు.