చెన్నై: హిందీ భాష వివాదంపై తమిళనాడు సీఎం స్టాలిన్‌ను బీజేపీ నేత సౌందర్యరాజన్(Tamilisai Soundarajan) నిలదీశారు. తిరుచీ రైల్వే స్టేషన్లో జరిగిన సైన్‌బోర్డు ఘటనను ఆమె ఖండించారు. డీఎంకే కార్యకర్తల ప్రవర్తను వ్యతిరేకిస్తున్నట్లు ఆమె చెప్పారు. ప్రజా ఆస్తులను ధ్వంసం చేయడం కరెక్టుకాదన్నారు. ఉత్తరాది రాష్ట్రాల నుంచి కూడా రాష్ట్రానికి జనం వస్తున్నారని, సైన్‌బోర్డుపై ఉన్న హిందీ భాషను తుడిచి వేయాల్సిన అవసరం ఏమివచ్చిందని ఆమె ప్రశ్నించారు.
మంత్రుల పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లు అందరూ సీబీఎస్ఈ స్కూళ్లలో చదువుతున్నారని, వాళ్లు మూడు భాషలను నేర్చుకుంటున్నారని, సీఎం స్టాలిన్‌కు ఓపెన్ సవాల్ చేస్తున్నానని, మీ పిల్లలు, మీ మంత్రుల కుటుంబాలకు చెందిన పిల్లలు ఎంత మంది కేవలం రెండు భాషలు మాత్రమే నేర్చుకుంటున్నారని ఆమె ప్రశ్నించారు.
ఎందుకు మీ మంత్రులు, మీ కుటుంబసభ్యులు సీబీఎస్ఈ స్కూళ్లను నడిపిస్తున్నారని తమిళసై అడిగారు. ప్రజల ఆసక్తిని ఎందుకు రాజకీయం చేస్తున్నారని అడిగారు. పంజాబ్, వారణాసికి మన పిల్లలు వెళ్లినప్పుడు, అక్కడ కమ్యూనికేషన్ సమస్య వచ్చిందని, తమిళనాడులో అనేక సమస్యలు ఉన్నాయని, వాటిని కప్పిపుచ్చేందుకు భాషపై ఎందుకు డీఎంకే రాజకీయం చేస్తుందని బీజేపీ నేత తమిళసై ప్రశ్నించారు.
#WATCH | Chennai | On Trichy Railway station signboard case, BJP leader Tamilisai Soundarajan says, “…I condemn the attitude of DMK workers, this is a public property…People from the North are also coming to the state…What authority do you have to erase Hindi… pic.twitter.com/wK5GnUkcBM
— ANI (@ANI) February 25, 2025