Raj Mishra | న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌కు చెందిన ఓ రైతు కొడుకైన రాజ్ మిశ్రా(37) యూకేలోని వెల్లింగ్బరో పట్టణ మేయర్‌గా ఎన్నికయ్యారు. ఈ నెల 14న ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. నార్తంప్టన్షైర్లో మార్కెట్ టౌన్‌గా పేరున్న వెల్లింగ్బరోలో ఈ నెల 6న జరిగిన స్థానిక ఎన్నికల్లో రాజ్ మిశ్రా విక్టోరియా వార్డ్ నుంచి గెలుపొందారు.
‘వెల్లింగ్‌బరోకు మేయర్‌గా సేవలందించే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నా. ఉత్సాహభరితమైన, సమ్మిళిత, సుసంపన్న సమాజాన్ని నిర్మించడం కోసం స్థానికులతో కలిసి పని చేయడానికి నేను కట్టుబడి ఉన్నా. మనమంతా కలిసి మన పట్టణానికి గొప్ప భవిష్యత్తును నిర్మించుకుందాం’ అని రాజ్‌మిశ్రా ఒక ప్రకటనలో తెలిపారు.