ప్రధాని మోదీ చేపట్టిన పరీక్షా పే చర్చ అన్న కార్యక్రమంపై ఎన్సీపీ సెటైర్ వేసింది. పరీక్షా పే చర్చా కార్యక్రమాన్ని తాము స్వాగతిస్తున్నామని ,అయితే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎప్పుడు చర్చను పెడతారని సూటిగా ప్రశ్నించింది. ప్రధాని చేపడుతున్న పరీక్షా పే చర్చా అన్న కార్యక్రమాన్ని వీక్షించాలని చాలా మంది ప్రచారం చేస్తున్నారని, అయితే.. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చ ఎప్పుడు ఉంటుందని నిలదీసింది.
పరీక్షల సమయంలో విద్యార్థులు తీవ్ర ఒత్తిడిలో ఉంటారు. ఇది నిజం. ఆ ఒత్తిడి నుంచి వారిని బయట పడేయడానికి మోదీ వారితో సంభాషించడం మంచిదే. మరి పరేషానీపే చర్చ ఎప్పుడు చేపడతారు? ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పుడు పరిగణనలోకి తీసుకుంటారు? అని ఎన్సీపీ అధికార ప్రతినిధి క్లైడ్ క్రాస్టో ప్రశ్నించారు.