లక్నో: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన మూన్ మిషన్ చంద్రయాన్-3 (Chandrayaan-3) విజయంపై కోట్లాది మంది భారతీయులతోపాటు ప్రపంచ వ్యాప్తంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండ్ సక్సెస్‌తో చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ చరిత్రకెక్కడంపై సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు దేశంలోని కొంత మంది చట్టసభ్యులు చంద్రయాన్-3 గురించి ఎలాంటి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యే, ఎస్బీఎస్పీ చీఫ్ ఓపీ రాజ్‌భర్ స్థానిక టీవీ ఛానెల్‌తో చంద్రయాన్-3 విజయం గురించి మాట్లాడారు. ‘భారత శాస్త్రవేత్తల కృషి, పరిశోధనలకు ధన్యవాదాలు. చంద్రయాన్-3తో సాధించిన విజయానికి నేను వారిని అభినందిస్తున్నా. వారు సురక్షితంగా భూమికి తిరిగి వచ్చిన తర్వాత, దేశం మొత్తం వారిని స్వాగతించాలి’ అని రాజ్‌భర్ అన్నారు.
కాగా, చంద్రయాన్-3 పూర్తిగా మానవరహిత మూన్ మిషన్. ఇందులో వ్యోమగాములు ఎవరూ లేరు. చంద్రుడి వాతావరణం, ఉపరితలంపై పరిశోధనల కోసం చేపట్టిన ప్రయోగమిది. ల్యాండర్ నుంచి చంద్రుడి నేలపై దిగిన రోవర్ ఈ పరిశోధనలు చేస్తుంది. సంబంధిత సమాచారాన్ని ఇస్రోకు పంపుతుంది. అయితే ఈ విషయం తెలియని కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు చంద్రయాన్-3 మిషన్ గురించి అవగాహన లేకుండా మాట్లాడటంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వీడియో క్లిప్‌లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
"Chandrayan ki safal landing ke liye NASA ko badhaai."
"Kal jab Chandrayan wapas aayega uska bhavya swagat hona chahiye."
"Chandrayan par jo yatri gaye hain.."
The absolute state of Indian politicians! pic.twitter.com/DBBQA3LpCL
— THE SKIN DOCTOR (@theskindoctor13) August 24, 2023