Nursing Scam | భోపాల్: బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో ‘నర్సింగ్ స్కామ్’ రగడ కొనసాగుతున్నది. నాలుగు లక్షల మంది విద్యార్థుల భవిత ప్రశ్నార్థకంగా మారిందని ఆరోపిస్తూ ప్రభుత్వంపై ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నది.
ఇదే అంశాన్ని అసెంబ్లీలోనూ లేవనెత్తింది. దీంతో షెడ్యూల్ ప్రకారం ఈ నెల 19 వరకు జరగాల్సిన అసెంబ్లీ సమావేశాలను 14 రోజుల ముందుగానే, జూలై 5నే ముగించింది. ప్రస్తుత క్రీడా శాఖ మంత్రి, నర్సింగ్ కుంభకోణం జరిగినప్పుడు వైద్యవిద్య శాఖ మంత్రిగా ఉన్న విశ్వాస్ సారంగ్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది.
మధ్యప్రదేశ్లోని పలు నర్సింగ్ కళాశాలల్లో నరైన వసతులు లేవని, ఇంకొన్ని నర్సింగ్ కళాశాలలు కేవలం పేపర్ మీదనే ఉన్నాయనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో గతంలో నర్సింగ్ విద్యకు అనువైనవిగా సీబీఐ రిపోర్టు ఇచ్చిన 169 కళాశాలపై మళ్లీ విచారణ జరపాలని హైకోర్టు మే 30న ఆదేశించింది.