Google Search 2023: ఈ ఏడాది ‘భారత్’ గురించి ప్రపంచం ‘సెర్చ్’ చేసిందేంటి..?
Google Search 2023: ప్రపంచవ్యాప్తంగా నెట్టింట భారత్ లో దేని గురించి ఎక్కువ వెతికారు..? అన్న అంశంపై ప్రభుత్వం ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
Google Search 2023: మరో పదిహేను రోజులైతే కాలచక్రంలో ఇంకో ఏడాది చరిత్రలో భాగం కాబోతున్నది. ఈ నేపథ్యంలో 2023లో ప్రపంచవ్యాప్తంగా నెటిజనులు ఏం అంశం గురించి ఎక్కువగా వెతికారు..? అన్నదానిపై ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్, సోషల్ మీడియా సైట్లు ఇందుకు సంబంధించిన డేటాను రిలీజ్ చేస్తున్నాయి. తాజాగా ప్రపంచవ్యాప్తంగా నెట్టింట భారత్ లో దేని గురించి ఎక్కువ వెతికారు..? అన్న అంశంపైకేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ‘మైగవ్ఇండియా’ (Mygovindia) ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఎక్స్ (ట్విటర్)లో ‘మైగవ్ఇండియా’ ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా నెటిజనులు గూగుల్‌లో ఏ ఏ విషయాల గురించి ఎక్కువ సెర్చ్ చేశారు..? అన్న వివరాలు తెలిపింది.
ఈ ఏడాది భారత్ గురించి అధికంగా సెర్చ్ చేసిన విషయాలలో ‘‘ ‘గ్లోబల్ సౌత్’ను భారత్ ఎలా లీడ్ చేస్తోంది..?’, ‘జీ20లో ఆఫ్రికా దేశాలకు భారత్ ఎలా సభ్యత్వం కల్పించింది..?’, ‘చందమామ దక్షిణ దృవంపై దిగిన తొలి దేశంగా భారత్ నిలవగలిగింది..?’, ‘పీఎం మోడీ వరల్డ్ మోస్ట్ పాపులర్ లీడర్ ఎలా అయ్యారు..?’’ వంటి విషయాలను ఎక్కువగా శోధించినట్టు మైగవ్ ఇండియా పేర్కొంది.
India had an incredible 2023 as the world marvelled at what all we achieved together.
Here’s our fun take on what the globe might have Googled about India in 2023!#GoogleIt#NewIndia#IndiaSearches pic.twitter.com/a6MZTaF2FC
— MyGovIndia (@mygovindia) December 14, 2023
అంతేగాక ‘భారత్‌లో బిజినెస్ ఎలా ప్రారంభించాలి..?’, ‘యూరప్ నుంచి కాశ్మీర్ వెళ్లాలంటే ధర ఎంత అవుతుంది..?’, ‘భారత్‌లో తయారీ అయ్యే వస్తువులను విదేశాల్లో కొనాలంటే ఎక్కడ కొనాలి..?’. ‘భారత్‌లో
అమలవుతున్న యూపీఐ చెల్లింపులు ఇతర దేశాలలో ఎప్పుడు అందుబాటులోకి వస్తాయి..? ’ వంటి అంశాలను ఆసక్తిగా తెలుసుకున్నారని మై గవ్ ఇండియా తెలిపింది. మీరు భారత్‌లో దేని గురించి ఎక్కువగా వెతికారు..? అని నెటిజనులను ప్రశ్నించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

