NOTA | పోటీ నుంచి తప్పుకుని బీజేపీలో చేరిన అభ్యర్థి.. ‘నోటా’తో గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్ పిలుపు
NOTA | కాంగ్రెస్ అభ్యర్థి ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. నామినేషన్ వేసిన ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. దీంతో ఆ పార్టీ అభ్యర్థి పోటీలో లేకుండాపోయారు. ఈ నేపథ్యంలో ‘నోటా’తో బీజేపీకి గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది.
భోపాల్: కాంగ్రెస్ అభ్యర్థి చివరి నిమిషంలో ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. నామినేషన్ వేసిన ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. దీంతో ఆ పార్టీ తరుఫున ఏ అభ్యర్థి పోటీలో లేకుండాపోయారు. ఈ నేపథ్యంలో ‘నోటా’తో (NOTA) బీజేపీకి గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థిగా అక్షయ్ కాంతి బామ్ నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఉపసంహరణ రోజున అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు.
కాగా, ప్రత్యామ్నాయ అభ్యర్థిని పోటీకి దించేందుకు కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో పిటిషన్ వేసినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో ఇండోర్‌లో కాంగ్రెస్ తరుఫున అభ్యర్థి లేకుండాపోయారు. బీజేపీ అభ్యర్థి సిట్టింగ్ ఎంపీ శంకర్ లాల్వానీ, మరో 13 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. అయితే వారంతా తమకు పోటీ కాదని బీజేపీ భావిస్తున్నది.
మరోవైపు ఇండోర్‌లో పార్టీ అభ్యర్థి పోటీలో లేకుండా మోసం చేసిన బీజేపీకి గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. దీంతో నాలుగో దశలో భాగంగా సోమవారం ఇండోర్ స్థానానికి జరిగే పోలింగ్‌లో ‘నోటా’ గుర్తును నొక్కాలని పార్టీ కార్యకర్తలు, ప్రజలకు పిలుపునిచ్చింది. ‘నోటాకు రికార్డు స్థాయిలో ఓటు వేసి బీజేపీకి గుణపాఠం చెప్పండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’ అని ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ జితు పట్వారీ, ఇతర నాయకులు ప్రజలను కోరారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cop Rapes Girl | పోలీస్ సహాయం కోరిన బాలిక.. కార్యాలయంలో పోలీస్ అధికారి అత్యాచారం
Harish Rao | రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్..భూములను కాపాడిందే బీఆర్ఎస్ : మాజీ మంత్రి హరీష్‌రావు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
‘కార్మిక హక్కుల పరిరక్షణకు ఐక్య పోరాటాలు కొనసాగించాలి’
ఆంధ్రా విద్యుత్ పునరుద్ధణ పనుల్లో మన ఉద్యోగులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

