న్యూఢిల్లీ: బీహార్లో కాంగ్రెస్, ఆర్జేడీ మధ్య పొత్తుకు బ్రేకప్ పడింది. ఈ నేపథ్యంలో ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ దీనిపై స్పందించారు. ఆదివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘కాంగ్రెస్తో పొత్తు అంటే ఏమిటి?.. నష్టాల కోసం కాంగ్రెస్కు అన్నీ వదిలేస్తామా? డిపాజిట్లు కోల్పోవాలా?’ అని ఆయన ప్రశ్నించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మహాకూటమిగా ఏర్పడిన ఆర్జేడీ, కాంగ్రెస్.. మిగతా చిన్న పార్టీలతో కలిసి పోటీ చేశాయి. అయితే మెజార్టీ స్థానాల్లో ఆర్జేడీ విజయం సాధించగా కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని చవి చూసింది. దీంతో బీహార్లో అధికారంలోకి రావాలని భావించిన ఆర్జేడీ ఆశలు ఆవిరయ్యాయి. ఈ నేపథ్యంలో ఇటీవల కాంగ్రెస్తో పొత్తును ఆర్జేడీ వదులుకున్నది.
మరోవైపు పశువుల దానా స్కామ్లో జైలు శిక్ష పడిన లాలూ, అనారోగ్య కారణాలతో కొన్ని నెలల కిందట బెయిల్పై విడుదల అయ్యారు. అయితే నాటి నుంచి ఢిల్లీలోనే ఉంటున్న ఆయన సొంత రాష్ట్రానికి వెళ్లనున్నారు.
#WATCH | Delhi: RJD leader Lalu Prasad Yadav speaks on the breaking of party's alliance with Congress in Bihar. He says, "What is Congress' alliance? Would we have left everything to Congress for a loss? For losing of deposits?"
— ANI (@ANI) October 24, 2021
The RJD leader will go to Patna. pic.twitter.com/3IZpa41zuU