న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ 2024-25 బడ్జెట్ను(Union Budget 2024) ప్రవేశపెట్టారు. ఏడోసారి ఆమె వరుసగా బడ్జెట్ను చదివారు. బడ్జెట్ తర్వాత ఏయే వస్తువులు ధరలు పెరిగాయి, ఏయే వస్తువుల ధరలు తగ్గయో తెలుసుకుందాం. బడ్జెట్ ప్రభావం వల్ల ధరలు తగ్గిన వాటిల్లో మూడు రకాల క్యాన్సర్ మందులు, మొబైల్ ఫోన్లు, ఛార్జర్లు, దిగుమతి చేసిన బంగారం, దిగుమతి చేసిన వెండి ఉన్నాయి. లెదర్ గూడ్స్ , సీఫుడ్, ఎక్స్ రే ట్యూబ్లు, రొయ్యలు, ఫిష్ ఫీడ్, ఉక్కు, రాగి, సోలార్ సెల్స్-ప్యానళ్ల తయారీకి అవసరమైన వస్తువులు, 25 రకాల క్రిటికల్ మినరల్స్, బ్రూడ్స్టాక్, పాలీచేటి వార్మ్స్, ష్రింప్, ఫిష్ ఫీడ్, మిథైలిన్ డైఫినైల్ డిస్సోసియనేట్(ఎండీఐ) ఉన్నాయి. ఇక ధరలు పెరిగిన వస్తువుల్లో ప్లాస్టిక్ ఐటమ్లు, పవీసీ ఫ్లెక్స్ బ్యానర్లు, సోలార్ గ్లాస్, టిన్డ్ కాపర్ ఇంటర్కనెక్ట్, అమ్మోనియం నైట్రేట్ ఉన్నాయి.