ఆయన స్పందిస్తూ.. ‘ఎన్నిసార్లు చెప్పాలి. మేం కచ్చితంగా పేరు మార్చబోతున్నాం. మా ప్రభుత్వం తొలి అసెంబ్లీ సమావేశాల్లో ఇదే బిల్లు ఉంటుంది. ఈ రాష్ట్ర చరిత్రతో అనుబంధం ఉన్న పేరునే రాష్ర్టానికి పెట్టబోతున్నాం. ఇక నుంచి పశ్చిమ బంగ్లా, బంగ్లా అనే పేర్లు ఉండవు. కేవలం పశ్చిమ బంగా మాత్రమే ఉంటుంది. ప్రజల మనోభావాలను గౌరవిస్తూ ఈ పేరును పెట్టాలని నిర్ణయించాం’ అని సమిక్ భట్టాచార్య వెల్లడించారు. గత సోమవారం కూడా ఆయన ఇదే తరహా ప్రకటన చేశారు.