కోల్‌కతా: ఓ యువ ఐపీఎస్ ఆఫీసర్‌కు పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి పబ్లిగ్గా వార్నింగ్ ఇచ్చారు. ఈస్ట్ మేదినిపూర్ ఎస్పీగా ఉన్న అమర్నాథ్ కాల్ రికార్డులన్నీ తన దగ్గర ఉన్నాయని ఈ సందర్భంగా ఆయన చెప్పడం గమనార్హం. జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేశారు. అమర్నాథ్ అనే ఓ యువకుడు ఇక్కడికి ఎస్పీగా వచ్చాడు. అతనేంటో నాకు తెలుసు. అతనికి ఒక్కటే చెప్పదలచుకున్నా. నువ్వో సెంట్రల్ కేడర్ అధికారివి. నిన్ను కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ లేదా బారాముల్లాకు ట్రాన్స్ఫర్ చేసేలా ఏ పనీ చేయొద్దని చెబుతున్నా అని సువేందు అన్నారు.
మేనల్లుడి (టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ) ఆఫీస్ నుంచి ఎవరెవరు నీకు కాల్ చేస్తున్నారో అన్ని రికార్డులు నా దగ్గర ఉన్నాయి. నీకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటే మాకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంది అని సువేందు అనడం గమనార్హం. ఎస్పీ ఆఫీస్ దగ్గర నిర్వహించిన ఆందోళనలో బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి సువేందు మాట్లాడారు. సువేందుపై ఉన్న ఆరోపణలపై మమతా బెనర్జీ ప్రభుత్వం విచారణకు ఆదేశించిన సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన సెక్యూరిటీ గార్డ్ హత్యపై సీఐడీ, ఓ దొంగతనం కేసులో పోలీసులు విచారణ జరుపుతున్నారు.