చండీగఢ్‌లో రేపటి నుంచి వీకెండ్ కర్ఫ్యూ

చండీగఢ్: కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్‌లో కరోనా తీవ్రత నేపథ్యంలో రేపటి నుంచి వీకెండ్ కర్ఫ్యూ అమలులోకి వస్తుంది. శనివారం ఉదయం 5 గంటల నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు వారాంత కర్ఫ్యూ విధిస్తారు. నిత్యవసర వస్తువులు హోమ్ డెలివరీకి మధ్యాహ్నం 2 గంటల వరకు షాపులు తెరిచేందుకు అనుమతిస్తారు. రాత్రి 9 గంటల వరకు రెస్టారెంట్ల నుంచి ఫుడ్ హోమ్ డెలివరీకి అనుమతిస్తారు.
వీకెండ్ కర్ఫ్యూ సమయంలో వివాహాలకు 50 మందికి, అంత్యక్రియలకు 20 మందికి పర్మిషన్ ఇస్తారు. నిత్య, అత్యవసర విధులు నిర్వహించే రంగాలకు వీకెండ్ కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చారు. సంబంధిత ఉద్యోగులు తమ ఐడీ కార్డును చూపించాల్సి ఉంటుంది. అంతరాష్ట్ర ప్రయాణాలు, సరుకు రవాణాపై ఎలాంటి ఆంక్షలు విధించలేదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

