లక్నో: ఉత్తర ప్రదేశ్లో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) ఘోరంగా ఓడిపోయింది. పార్టీ కంచుకోట లైన రాంపూర్, అజంగఢ్ స్థానాలు బీజేపీ వశమయ్యాయి. దీంతో ఆ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీలోని అన్ని విభాగాలను ఆదివారం పూర్తిగా రద్దు చేశారు. 2024 లోక్ సభ ఎన్నికల కోసం ఎస్పీని బలోపేతం చేయాలని భావించారు. దీంతో పూర్తి స్థాయిలో పార్టీ పునర్నిర్మాణం కోసం జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయి కార్యనిర్వాహక సంస్థలతోపాటు యువత, మహిళా విభాగాలను కూడా రద్దు చేశారు. ఆయా పదవుల్లో ఉన్న వారిని తొలగించారు. అయితే ఉత్తర ప్రదేశ్ యూనిట్ చీఫ్ నరేష్ ఉత్తమ్ మాత్రం తన స్థానంలో కొనసాగనున్నారు.
సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) ఈ మేరకు ఆదివారం తన అధికార ట్విట్టర్ ఖాతాలో ప్రకటించింది. 2024 లోక్సభ ఎన్నికలకు పార్టీ సిద్ధమవుతోందని, బీజేపీని పూర్తి స్థాయిలో ఎదుర్కొనేందుకు సంస్థను బలోపేతం చేయడంపై దృష్టి సారించినట్లు ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు.
समाजवादी पार्टी के राष्ट्रीय अध्यक्ष श्री अखिलेश यादव जी ने तत्काल प्रभाव से सपा उ.प्र. के अध्यक्ष को छोड़कर पार्टी के सभी युवा संगठनों, महिला सभा एवं अन्य सभी प्रकोष्ठों के राष्ट्रीय अध्यक्ष, प्रदेश अध्यक्ष,जिला अध्यक्ष सहित राष्ट्रीय,राज्य, जिला कार्यकारिणी को भंग कर दिया है।
— Samajwadi Party (@samajwadiparty) July 3, 2022