‘సింధూరం’ హిందూ వివాహిత బాధ్యత.. విడాకుల కేసులో ఇండోర్ కోర్టు తీర్పు
సింధూరం (బొట్టు) పెట్టుకోవడం హిందూ వివాహిత బాధ్యత అని, అది పెట్టుకుంటే వివాహితగా తెలుస్తుందని మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ ఫ్యామిలీ కోర్టు పేర్కొన్నది.
ఇండోర్, మార్చి 23: సింధూరం (బొట్టు) పెట్టుకోవడం హిందూ వివాహిత బాధ్యత అని, అది పెట్టుకుంటే వివాహితగా తెలుస్తుందని మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ ఫ్యామిలీ కోర్టు పేర్కొన్నది. ఇండోర్‌కు చెందిన దంపతులకు 2017లో వివాహం జరిగింది. వారికి ఐదేండ్ల కుమారుడు ఉన్నాడు. అయితే ఐదేండ్ల క్రితం తన భార్య తనను వదిలి వెళ్లిందని, ఆమె మళ్లీ తనతో కలిసి ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని భర్త కోర్టుకెక్కాడు.
ఈ పిటిషన్‌ను విచారించిన ఇండోర్ ఫ్యామిలీ కోర్టు ప్రిన్సిపల్ జడ్జి ఎన్పీ సింగ్.. ‘మహిళ కోర్టులో స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు సింధూరం పెట్టుకోవడం లేదని చెప్పింది. సింధూరం పెట్టుకోవడం హిందూ వివాహిత బాధ్యత. భర్త ఆమెను విడిచిపెట్టలేదు. ఆమే భర్తను విడిచిపెట్టింది. తన భర్త కట్నం కోసం శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని ఆమె ఆరోపించినప్పటికీ ఇందుకు ఆధారాలు లేవు. పోలీసులకు ఆమె ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. కాబట్టి, మహిళ వెంటనే తన భర్త ఇంటికి తిరిగి వెళ్లాలి’ అని తీర్పు చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Binod Chaudhary: నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆ దేశ ఏకైక బిలియనీర్
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

