న్యూఢిల్లీ: గత వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకున్నామని, ఈసారి ఏ ప్రక్రియ విఫలమైనా చంద్రయాన్-3 ప్రయోగాన్ని విజయవంతం చేస్తామని భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో) చైర్మన్ సోమనాథ్ పునరుద్ఘాటించారు. చంద్రుడిపై సురక్షితంగా ల్యాండింగ్ చేసేందుకు వీలుగా అధిక ఇంధనం, ల్యాండింగ్‌కు ఎక్కువ ప్రాంతాన్ని ఎంచుకున్నామని వెల్లడించారు. ఈనెల 14న మధ్యాహ్నం 2:35 గంటలకు చంద్రయాన్-3 నింగిలోకి దూసుకెళ్తుందని తెలిపారు. న్యూఢిల్లీలో సోమవారం నిర్వహించిన ఇండియన్ స్పేస్ కాంగ్రెస్‌లో ఆయన మాట్లాడారు. వైఫల్యాల ఆధారంగా డిజైన్‌ను రూపొందించామని తెలిపారు.
చంద్రయాన్-3కి గోద్రెజ్ పరికరాలు
ముంబై: చంద్రయాన్-3కి అవసరమైన వికాస్ సీఈ20 లిక్విడ్ ప్రొపల్సన్ ఇంజిన్లు, శాటిలైట్ థ్రస్టర్లను గోద్రెజ్ ఏరోస్పేస్ కంపెనీ సమకూర్చినట్టు ఆ కంపెనీ సీనియర్ అధికారి తెలిపారు.