Tejashwi Yadav : బీహార్ (Bihar) అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) ఫలితాలు వెలువడకముందే ఆర్జేడీ అగ్ర నాయకుడు (RJD top leader), మహాగఠ్‌బంధన్ (Mahagathbandhan) సీఎం అభ్యర్థి (CM candidate) తేజస్వియాదవ్ (Tejashwi Yadav) గెలుపు తమదేనని ధీమా వ్యక్తంచేశారు. ఎగ్జిట్ పోల్ ఫలితాలన్నీ ఎన్డీయే కూటమికే పట్టంగట్టినా తేజస్వి మాత్రం వాటిని తేలిగ్గా తీసిపారేశారు.
ఆ సర్వేలన్నీ గోడీ మీడియా చేసిన సర్వేలని తేజస్వి ఎద్దేవా చేశారు. పోలింగ్ సమయం 6 గంటలకు ముగిసినా ఓటర్లు రాత్రి 7, 8 గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకున్నారని, ఎగ్జిట్‌పోల్ ఫలితాలు మాత్రం అంతకంటే ముందే వెలువడ్డాయని చెప్పారు. అలాంటప్పుడు ఆ ఎగ్జిట్ పోల్స్‌కు ప్రమాణికత ఏముంటుందని ప్రశ్నించారు.
నవంబర్ 14న ఫలితాలు వెలువడుతాయని, నవంబర్ 18న తాము ప్రమాణస్వీకారాలు చేస్తామని తాను ముందే చెప్పానని, ఇప్పుడు కచ్చితంగా అదే జరిగి తీరుతుందని తేజస్వి చెప్పారు. గోడీ మీడియా చేసే ఎగ్జిట్ పోల్ సర్వేలు ప్రత్యర్థులపై ఒత్తడి పెంచడానికేనని అన్నారు. ఈసారి రికార్డు స్థాయిలో ఓటింగ్ జరిగిందని, ఎన్డీయే పాలనతో విసిగిపోయిన ఓటర్లు మార్పు కోసం భారీగా తరలివచ్చారని అన్నారు.