చెన్నై: కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (CPI) ప్రధాన కార్యదర్శి (General Secretary) డీ రాజా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తమిళనాడు రాజధాని చెన్నైలో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన ఉన్నట్టుండి కుప్పకూలారు.
దాంతో స్థానికంగా ఉన్న పార్టీ నేతలు ఆయనను హుటాహుటిన కారులో ఆస్పత్రికి తరలించారు. మంగళవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం ఆస్పత్రిలో ఆయన పరిస్థితి ఎలా ఉందనే వివరాలు తెలియాల్సి ఉంది.
#WATCH | Tamil Nadu: CPI general secretary D Raja fell ill during the party’s protest in Chennai earlier today. He has been taken to hospital; more details are awaited. pic.twitter.com/sr2aHr2ytm
— ANI (@ANI) July 25, 2023