సిలిగురి: పశ్చిమబెంగాల్ రాష్ట్రం జల్పాయ్గురి జిల్లాలోని సిలిగురి పట్టణ సమీపంలోగల బెంగాల్ సఫారీ పార్కులో రికా అనే పెద్దపులి మూడు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ నెల 19న ఆ మూడు పులి కూనలు జన్మించాయని బెంగాల్ సఫారీ పార్క్ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం తల్లీ, పిల్లలు సఫారీ పార్కులో సందడి చేస్తున్నాయి.
రికా, దాని పిల్లలు సందడి చేస్తున్న దృశ్యాలు ఎన్క్లోజర్లోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. బెంగాల్ సఫారీ పార్కు అధికారులు ఆ వీడియోను విడుదల చేశారు. కింది వీడియోలో పెద్దపులి రికాను, దాని మూడు పిల్లలను మీరు కూడా వీక్షించవచ్చు.
#WATCH | Rika, a tigress gave birth to three cubs at Bengal Safari Park near Siliguri under Jalpaiguri district of West Bengal on 19th August 2023.
(CCTV visuals source: Bengal Safari Park Authorities) pic.twitter.com/FdCpAVllgO
— ANI (@ANI) August 26, 2023