Video | మీరు నాపై జేపీసీ వేయించేలా ఉన్నారు.. ఖర్గేతో రాజ్యసభ చైర్మన్ సరదా కామెంట్
Rajya Sabha | రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా రాజ్యసభలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే మాట్లాడుతూ.. అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలని మరోసారి డిమాండ
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా రాజ్యసభలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే మాట్లాడుతూ.. అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలని మరోసారి డిమాండ్ చేశారు. అదానీ అంశంపై జేపీసీ వేయాలన్నది కేవలం కాంగ్రెస్ పార్టీ డిమాండ్ కాదని, ఈ సభలో ఉన్న అన్ని పార్టీలు అదే డిమాండ్ చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
ఇక్కడ ఉన్నవాళ్లమంతా ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులమని, ప్రజలకు నష్టం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉన్నదని ఖర్గే వ్యాఖ్యానించారు. ఆ తర్వాత చైర్మన్ ధనకర్ను ఉద్దేశించి ఖర్గే.. ‘మీరు నాతో ఒక విషయం చెప్పారు. వారితో చెప్పారో లేదో (హోంమంత్రి అమిత్షాను చూపుతూ).. అమిత్ షాకు చెప్పకపోయారా..’ అన్నారు. ఈ సందర్భంగా సభ్యుల ముఖాల్లో నవ్వులు చిగురించాయి.
‘మీరు నాతో.. న్యాయవాద వృత్తిలోకి వచ్చిన కొత్తలో డబ్బులు చేతితో లెక్కబెట్టేవాడినని, ఇప్పుడు సంపద పెరగడంతో మిషన్తో లెక్కబెడుతున్నానని చెప్పారు’ అని చైర్మన్ను ఉద్దేశించి ఖర్గే అనగానే ధన్కర్ ‘లేదు లేదు నేను ఆ మాట చెప్పలేదు’ అంటూ కంగారుపడ్డంత పనిచేశారు. ‘మీ వాలకం చూస్తుంటే నాపై జేపీసీ వేయించేలా ఉన్నారు’ అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ప్రధాని సహా సభ్యులంతా గొల్లున నవ్వారు.
#WATCH | Rajya Sabha Chairman Jagdeep Dhankhar in exchange with LoP Mallikarjun Kharge who is demanding JPC on the Adani issue says, “it seems you will set up a JPC on me.”
(Video source: Sansad TV) pic.twitter.com/hGEt7oPeGz
— ANI (@ANI) February 8, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

