Actor Vijay : తమిళనాడులోని చెంగల్పట్టు పట్టణంలో సందడి నెలకొంది. అక్కడ వీధివీధిన తమిళ స్టార్ హీరో విజయ్ పోస్టర్లు వెలిశాయి. విజయ్ స్థాపించిన ‘తమిళగ వెట్రి కజగం (TVK)’ పార్టీ కార్యకర్తలు ఎక్కడికక్కడ తమ అధినేత పోస్టర్లు ఏర్పాటు చేశారు. ఇంత హంగామా దేనికంటే విజయ్ టీవీకే పార్టీని స్థాపించిన తర్వాత అక్కడ ఎప్పుడు రాష్ట్ర స్థాయి సమావేశాలు నిర్వహించలేదు.
ఈ నేపథ్యంలో టీవీకే రాష్ట్ర స్థాయి సమావేశాలు నిర్వహించాలని ఆ పార్టీ అధ్యక్షుడు విజయ్ నిర్ణయించారు. అందుకు అక్టోబర్ 27న ముహూర్తం పెట్టుకున్నారు. విల్లుపురం జిల్లాలోని విక్రవంది ఏరియాలో ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో చుట్టుపక్కల పట్టణాల్లో పార్టీ కార్యకర్తలు పార్టీ పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేశారు.
#WATCH | Tamil Nadu | Posters of Actor and TVK President Vijay’s put up in Chengalpattu.
The first-ever state conference of actor Vijay’s Tamilaga Vettri Kazhagam (TVK) will take place tomorrow in the Vikravandi area of Villupuram district. pic.twitter.com/DjqQ9DjugN
— ANI (@ANI) October 26, 2024