Fire accident : మధ్యప్రదేశ్ (Madhyapradesh) రాష్ట్రం ఇండోర్ (Indore) లోని ఓ కెమికల్ ప్లాంట్లో భారీ అగ్నిప్రమాదం (Fire accident) సంభవించింది. మంగళవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక్కసారిగా అగ్నికీలలు ఎగిసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
ఘటనా ప్రాంతానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, అయితే భారీగా ఆస్తి నష్టం జరిగిందని అధికారులు తెలిపారు. ప్రమాదానికిగల కారణాలు తెలియాల్సి ఉందన్నారు.
#WATCH | Madhya Pradesh | Massive fire breaks out at chemical plant in Indore; Operation to douse the fire underway pic.twitter.com/jGYnWxSR36
— ANI (@ANI) October 14, 2025