శ్రీనగర్: ఎడతెరపి లేని వర్షాలు, వరదలతో ఉక్కిరిబిక్కిరి అయిన జమ్ముకశ్మీర్ రాష్ట్రం ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నది. అయితే ఇటీవలి వర్షాల వల్ల బాగా నానిపోయి ఉన్న కొండల పైనుంచి తరచూ కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఇలా విరిగిపడిన కొండచరియలు రహదారులను మూసివేసి వాహనాల రాకపోకలకు అడ్డంకిగా మారుతున్నాయి.
తాజాగా బుధాల్ మహోర్ రహదారిలో భారీ కొండచరియ విరిగిపడింది. రోడ్డు పక్కనే ఉన్న కొండ పైనుంచి ఓ భారీ గుండుతోపాటు దాని చుట్టు ఉన్న మట్టి, రాళ్లు ఒక్కసారిగా జారిపడ్డాయి. దాంతో ఆ ప్రాంతమంతా దట్టంగా దుమ్ములేసింది. ఈ దృశ్యాలను స్థానికులు తమ మొబైల్స్‌లో వీడియోలు తీశారు. ఓ వ్యక్తి ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.
దీనిపై సరిహద్దు రహదారుల సంస్థ (బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ – BRO) ధృవీకరణ చేసుకుని ఓ జాతీయ న్యూస్ ఏజెన్సీ ఆ వీడియోను ట్విటర్లో పోస్ట్ చేసింది. కింది వీడియోలో ఆ కొండచరియ విరిగిపడుతున్న దృశ్యాలను మీరు కూడా వీక్షించవచ్చు.
#WATCH | Jammu and Kashmir | A major landslide occurred on Budhal Mahore Road, in Reasi District.
(Video shot by civilian, confirmed by BRO) pic.twitter.com/cvjuiMiaDF
— ANI (@ANI) July 28, 2023