Kannan Gopinathan : మాజీ ఐఏఎస్ అధికారి (Former IAS officer), సామాజిక ఉద్యమ నేత కన్నన్ గోపీనాథన్ (Kannan Gopinathan) కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ (KC Venugopal), ఆ పార్టీ సీనియర్ నాయకుడు పవన్ ఖేరా (Pawan Khera) సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కేసీ వేణుగోపాల్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
దేశ రాజధాని ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ చేరిక చోటుచేసుకుంది. కేరళ రాష్ట్రానికి చెందిన కన్నన్ గోపినాథన్ 2019లో తన ఐఏఎస్ పదవికి రాజీనామా చేశారు. జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు అనంతరం కేంద్ర ప్రభుత్వం అక్కడ విధించిన ఆంక్షలను నిరసిస్తూ కన్నన్ గోపినాథన్ తన పదవిని వదులుకున్నారు.
కన్నన్ గోపినాథన్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా సంబంధించిన దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు.
#WATCH | Delhi: Former IAS officer Kannan Gopinathan joins Congress in the presence of Congress General Secretary (Organisation) K.C. Venugopal and party leader Pawan Khera. pic.twitter.com/9Zdh0l3t7x
— ANI (@ANI) October 13, 2025