Kirti Azad | ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన క్రికెటర్ కీర్తి ఆజాద్.. Video
Kirti Azad | లోక్సభ నాలుగో విడత ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్నది. ఏప్రిల్ 18న మొదలైన ఈ నాలుగో దశ నామినేషన్లు.. ఏప్రిల్ 25 వరకు కొనసాగనున్నాయి. పశ్చిమబెంగాల్లోని బర్దమాన్ దుర్గాపూర్ లోక్సభ స్థానానికి కూడా నాలుగో విడతలోనే పోలింగ్ జరగనుంది.
Kirti Azad : లోక్సభ నాలుగో విడత ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్నది. ఏప్రిల్ 18న మొదలైన ఈ నాలుగో దశ నామినేషన్లు.. ఏప్రిల్ 25 వరకు కొనసాగనున్నాయి. పశ్చిమబెంగాల్లోని బర్దమాన్ దుర్గాపూర్ లోక్సభ స్థానానికి కూడా నాలుగో విడతలోనే పోలింగ్ జరగనుంది.
అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ బర్దమాన్ దుర్గాపూర్ లోక్సభ స్థానానికి మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ను తన అభ్యర్థిగా బరిలో దించింది. దాంతో ఆజాద్ ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ స్థానిక నేతలతో కలిసి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకున్న ఆజాద్.. ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.
లోక్సభకు మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఏప్రిల్ 19న తొలి విడత ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఏప్రిల్ 26న రెండో విడత, మే 7న మూడో విడత, మే 13న నాలుగో విడత, మే 20న ఐదో విడత, మే 25న ఆరో విడత, జూన్ 1న ఏడో విడత ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. కాగా, కీర్తి ఆజాద్ నామినేషన్ దాఖలు చేసిన దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు.
#WATCH | West Bengal: Former cricketer and TMC candidate from Bardhaman–Durgapur, Kirti Azad files his nomination for #LokSabhaElections2024 pic.twitter.com/l1BCKJKdkq
— ANI (@ANI) April 23, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

