ఎలుగుబంటిని కాల్చిచంపిన అటవీ అధికారులు.. వీడియో
Sloth bear shot dead: వన్యప్రాణుల సంరక్షణ కోసమే ప్రభుత్వాలు అటవీ అధికారులను నియమిస్తాయి. కానీ ఉత్తరాఖండ్‌లో మాత్రం వన్యప్రాణులను సంరక్షించాల్సిన అటవీ అధికారులే ఓ ఎలుగుబంటిని కాల్చిచంపారు. అయితే

డెహ్రాడూన్: వన్యప్రాణుల సంరక్షణ కోసమే ప్రభుత్వాలు అటవీ అధికారులను నియమిస్తాయి. కానీ ఉత్తరాఖండ్‌లో మాత్రం వన్యప్రాణులను సంరక్షించాల్సిన అటవీ అధికారులే ఓ ఎలుగుబంటిని కాల్చిచంపారు. అయితే వాళ్లు ఆ ఎలుగును ఉద్దేశపూర్వకంగా ఏమీ చంపలేదు. వారిపై దాడికి ప్రయత్నించడంతో ఆత్మరక్షణ కోసం షూట్ చేశారు. దాంతో అది అక్కడికక్కడే చనిపోయింది. చమోలీ జిల్లా జోషిమఠ్ ఏరియాలోని సింగ్‌ద్వార్ సమీపంలో ఇవాళ తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది.
సింగ్‌ద్వార్ పరిసరాల్లో ఎలుగుబంటి సంచరిస్తున్నదని స్థానికులు మంగళవారం సాయంత్రం అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. దాంతో ఆ ఎలుగుబంటిని పట్టుకునేందుకు అధికారులు రంగంలోకి దిగారు. తీవ్రంగా గాలించి చివరికి ఆ ఎలుగుబంటి దాగి ఉన్న ప్రాంతాన్ని గుర్తించారు. అనంతరం దాన్ని వలద్వారా బంధించే ప్రయత్నం చేయగా అది వారిపై దాడికి ప్రయత్నించింది. దాంతో ఆత్మరక్షణ కోసం కాల్పులు జరుపగా అది మృతిచెందింది. ఈ ఘటనకు సంబంధించి అటవీ అధికారులు సోషల్ మీడియాలో పోస్టుచేసిన వీడియోను మీరు కూడా వీక్షించవచ్చు.
#WATCH | Forest officials shot dead a sloth bear after it attacked some of them when they were trying to catch it in Joshimath area of Chamoli, Uttarakhand last night.
— ANI (@ANI) September 22, 2021
A team of forest officials tried to catch the bear after it attacked some locals.
(Video: Forest Department) pic.twitter.com/emTxmuMBcm
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

